తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి – పద్మావతీపురం- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేసి పార్టీ 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి , తిరుపతి నియోజకవర్గం ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన నాయకుడని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
అలాగే తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీ సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
ఇందులో మేయర్ డాక్టర్ శిరీష , నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు..

Tags: 15 years since the formation of the YSR Congress Party