April 16, 2026
Explore
కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

April 16, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి

మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు

ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

Tags: PM Modi Announces Compensation for Victims of Kurnool Accident