July 26, 2026
Explore
సామాజిక కార్యకర్తల ఉద్యమాల ఫలితం.. రోడ్డు పనులు ప్రారంభించిన అధికారులు

సామాజిక కార్యకర్తల ఉద్యమాల ఫలితం.. రోడ్డు పనులు ప్రారంభించిన అధికారులు

July 26, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణం నుంచి బెంగుళూరుకు వెళ్లే ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అయూబ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ నిరాహార దీక్షకు స్పందించిన రహదారులు & భవనాల శాఖ అధికారులు ఆదివారం ఉదయం నుంచి రహదారి మరమ్మతు పనులను ప్రారంభించారు.

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రహదారి సమస్యకు సామాజిక కార్యకర్తల ఉద్యమం ఫలితంగా పరిష్కార దిశగా అడుగులు పడటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సామాజిక కార్యకర్తలకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు.

Tags; Result of social activists’ movements… officials begin roadworks.