April 16, 2026
Explore
ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ

ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ

April 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

చట్టసభల్లో మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం మరికాసేపట్లో మూడు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత దిశగా నేడు దేశం చరిత్రాత్మక ముందడుగు వేయబోతోందని అన్నారు. భారత దేశ మహిళలపై గౌరవంతో ఈ దిశగా సాగుతున్నామని అన్నారు. తల్లులకు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి మనం ఇచ్చే గౌరవమని వ్యాఖ్యానించారు. మహిళల గొప్పదనాన్ని చాటిచేప్పే శ్లోకాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు.

ఈ బిల్లులకు చట్టరూపం ఇచ్చేందుకు పార్లమెంటు నేటి నుంచీ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానున్న విషయం తెలిసిందే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్ఠంగా 850కు పెంచేలా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెడుతోంది. సీట్ల తుది సంఖ్యను మాత్రం డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభిస్తే 2029 నుంచీ ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల కేటాయింపుతో తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి..

Tags: This is a historic step: PM Modi