March 12, 2026
Explore
వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

March 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సొంత నియోజకవర ్గమైన పుంగనూరులో సంబరాలు మిన్నంటాయి. మాజీ ఎంపి రెడ్డెప్ప , సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, చౌడేపల్లె వైస్‌ఎంపిపి నరసింహారెడ్డి , మాజీ ఎంపిపి అంజిబాబు కలసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండలంలోని సుగాలిమిట్ట రహదారిపై వైఎస్సార్‌సిపి జిల్లా కార్యదర్శి ముడే శ్రీరాములునాయక్‌, సర్పంచ్‌లు దేవమ్మ , శ్రీనివాసులునాయక్‌ కలసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఏగురవేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిందాబాద్‌ …పెద్దిరెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేసి, బాణసంచాలు పేల్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామయ్య, వాసు, శంకర్‌, బాలాజి, మునోజ్‌కుమార్‌నాయక్‌, శివశంకర్‌నాయక్‌, పవన్‌కుమార్‌నాయక్‌, జయరాం నాయక్‌, రామాంజులు, రమణ. శ్రీరాములు తో పాటు న్యాయవాదులు మల్లికార్జునరెడ్డి, ఆనంద్‌కుమార్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: YSRCP Formation Day Celebrations