ఢిల్లీ ముచ్చట్లు:
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుపై నేతలు చర్చించనున్నారు. రేపు పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
Tags:INDIA Alliance Leaders to Meet Today