గద్వాల ముచ్చట్లు:
ఉండవెల్లి మండలంలో అలంపూర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు బాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా చితకబాదిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పదో తరగతి విద్యార్థుల పుస్తకాలు తీసుకున్నారని ఉద్దేశంతో 6, 7, 9వ తరగతులకు చెందిన 15 మంది విద్యార్థులను సోమవారం సాయంత్రం కర్రతో దారుణంగా కొట్టడంతో రక్త గాయాలతో విద్యార్థులు అల్లాడిపోయారు.
Tags: Principal Brutally Beats Gurukula Students in Gadwal District