April 14, 2026
Explore
కోర్టు విధుల నిర్వహణలో సమర్థత పెంపుపై దిశానిర్దేశం

కోర్టు విధుల నిర్వహణలో సమర్థత పెంపుపై దిశానిర్దేశం

April 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • కోర్టు విధుల నిర్వహణలో సమర్థత పెంపుపై దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,
  • కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించి కేసుల వేగవంతమైన పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించిన ఎస్పీ.
  • 2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించిన కోర్టు డిస్పోజల్ డేటా, NBWs, PRC కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహణ.
  • పెండింగ్ కేసులు, నాన్-బెయిలబుల్ వారెంట్స్ (NBWs) త్వరితగతిన అమలు చేయాలని అధికారులకు సూచనలు.
  • మౌంటెడ్ సిస్టమ్ ద్వారా కోర్టు విధుల నిర్వహణలో పారదర్శకత, సమన్వయం పెంపు అవసరమని ఎస్పీ సూచనలు.
  • కోర్టు విధుల్లో నిర్లక్ష్యం సహించము – జిల్లా ఎస్పీ స్పష్టం
  • పెండింగ్ కేసులపై ఫోకస్ సమయపాలనతో పనిచేయాలని ఎస్పీ ఆదేశం.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఉదయం 10:30 గంటలకు న్యూ డీపీఓ, తిరుపతిలో కోర్టు విధులు నిర్వహించే అన్ని పోలీస్ కానిస్టేబుళ్లతో (సెషన్స్ కానిస్టేబుళ్లు సహా) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు.
  • ఈ సందర్భంగా 2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల వారీగా కోర్టు కేసుల డిస్పోజల్ డేటా, పెండింగ్ NBWs, PRC కేసులు, CC/PRC/SC కు సంబంధించి పెండింగ్ అంశాలను సమీక్షించారు. కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రతి అధికారి నుండి కానిస్టేబుల్ వరకు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
  • ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ఎప్సి ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ కోర్టు విధుల్లో నిర్లక్ష్యం ఏ మాత్రం సహించనని హెచ్చరించారు, ప్రతి కేసును సమయానికి కోర్టుకు హాజరు చేయడం, NBWs అమలు చేయడం, మరియు కేసుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని తెలిపారు. మౌంటెడ్ సిస్టమ్ వినియోగాన్ని సమర్థవంతంగా ఉపయోగించి కేసుల స్థితిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.
  • అలాగే పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, కోర్టు పనుల్లో సమన్వయం పెంపు ద్వారా కేసుల డిస్పోజల్ శాతాన్ని మెరుగుపరచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారీగా బాధ్యతలను స్పష్టంగా గుర్తించి, లక్ష్యాలను నిర్ణయించి, వాటి సాధనపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని ఆదేశించారు. కోర్టు విధుల్లో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బంది తమ బాధ్యతను అత్యంత ప్రాముఖ్యతగా తీసుకోవాలని, కోర్టుకు సంబంధించిన ప్రతి ప్రక్రియలో ఖచ్చితత్వం, సమయపాలన ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు.
  • చిన్న నిర్లక్ష్యం కూడా కేసుల ఆలస్యానికి కారణమవుతుందని, దీని వల్ల న్యాయ ప్రక్రియకు ఆటంకం కలగవచ్చని హెచ్చరించారు. ప్రత్యేకంగా NBWs అమలు విషయంలో వేగం పెంచాలని, పరారీలో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కోర్టు సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించి, ఎటువంటి లోపాలు లేకుండా అప్‌డేట్ చేయాలని తెలిపారు.
  • పోలీసులు న్యాయవ్యవస్థతో సమన్వయంగా పనిచేసినప్పుడే ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. కోర్టు విధుల్లో పనిచేసే సిబ్బంది చట్టపరమైన అవగాహనను పెంపొందించుకుని, న్యాయస్థానాలతో సమన్వయం కలిగి పని చేయడం ద్వారా ప్రజలకు వేగవంతమైన న్యాయం అందేలా కృషి చేయాలని ఆదేశించారు.
  • బాధ్యతాయుతంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారిని ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
  • ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరావు (పరిపాలన) డీసీర్బ్ డిస్పీ రమణ పాల్గొన్నారు.

Tags: Guidance on Enhancing Efficiency in the Discharge of Court Duties