అమరావతిముచ్చట్లు:
రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ జె. కులశేఖర్ అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. తరువాత ఆయన మాట్లాడుతూ బలమైన ప్రజాస్వామ్యం దేశం గా మన దేశం నిలవడానికి ఆయన రూపొందించిన భారత రాజ్యాంగమే కారణమని కొనియాడారు. ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బాధ్యతాయుత పౌరుడుగా మనం ఉండాలని సూచించారు. తరువాత అధికారులు, సిబ్బంది అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వీ. శ్రీనివాసరెడ్డి, ఎండీ షరీఫ్, సీఐ ఖాదర్ బాషా, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్వోలు సుభాష్, వెంకట సుబ్బయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Grand Tributes Paid to Ambedkar on His Birth Anniversary at the Task Force