అమరావతిముచ్చట్లు:
కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం లోకసభ సీట్ల పెంపునకు సంబంధించిన బిల్లుపై పార్లమెంటు సభ్యులకు సమాచారం అందించింది.
రాజ్యాంగ విలువలని, ప్రజాస్వామ్య సూత్రాలని తుంగలో తొక్కి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్ర దేశ సమగ్రతకే అత్యంత ప్రమాదకరం
ఒక పక్క అధికారికంగా జనాభా గణన నిర్వహించకుండా, అసలు లెక్కలే తేల్చకుండా లోకసభ సీట్లను 850కి పెంచుతామనడం పచ్చి మోసం తప్ప మరొకటి కాదు.
మహిళా రిజర్వేషన్ల పేరు చెప్పి వెనక సీట్ల పెంపు అనే విషాన్ని కలిపి దేశంపైకి వదులుతున్నారు.
ఆర్టికల్ 82ను కాలరాస్తూ, 2026 నిబంధనను పక్కన పెట్టి దొడ్డిదారిన ఈ మార్పులు చేయడం అత్యంత హేయమైన చర్య.
జనాభా నియంత్రణ పాటించి, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడమే వీరి అసలు లక్ష్యం.
జనాభా పెంచుకుంటూ పోయిన రాష్ట్రాలకి సీట్లు పెంచి, క్రమశిక్షణతో ఉన్న మనలాంటి రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని ఖతం చేయాలని చూస్తున్నారు.
ఇది కేవలం సీట్ల పెంపు కాదు, దక్షిణాదిపై జరుగుతున్న రాజకీయ దాడి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో చక్రం తిప్పొచ్చనే వీరి అహంకారం, భవిష్యత్తులో దక్షిణాదిని రెండో శ్రేణి పౌరులుగా మార్చేస్తుంది.
ఏ ప్రాతిపదికన సీట్లు పెంచుతున్నారో చెప్పకుండా, అన్ని పార్టీలని చీకట్లో ఉంచి ఈ తతంగం నడపడం వీరి నియంతృత్వ ధోరణికి పరాకాష్ట.
మన రాజకీయ ఉనికిని, మన రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలంటే ఇప్పటికైనా దక్షిణాది అంతా ఏకమవ్వాలి.
ఈ కుటిల రాజకీయాలని ఎదుర్కోకపోతే, ఢిల్లీ పీఠం ముందు మన గొంతు ఎప్పటికీ వినబడదు.
దేశాన్ని ముక్కలు చేసే ఇలాంటి స్వార్థపూరిత నిర్ణయాలని అడ్డుకోవడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం. దీనిపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది
Note : ఈ బిల్లుకి మద్దతూ ఇచ్చే ఏ పార్టీ అయిన దక్షిణది చరిత్రలో చరిత్ర హినులు కావడం ఖాయం.
Tags: The Bill regarding the increase in Lok Sabha seats