పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఫైర్‌స్టేషన్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. మంగళవారం స్టేషన్ ఇన్‌చార్జ్ ఫైర్ ఆఫీసర్ సురేష్‌బాబు, సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 1944 సంవత్సరం ముంబై ఒడరేవు అగ్నిప్రమాదంలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాలు గురించి వివరించారు. వేసవిలో అగ్నిప్రమాదాలు తరచు సంభవిస్తుందని, వీటిని నివారించేందుకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అన్సర్‌బాషా, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Fire Safety Week