April 14, 2026
Explore
బాబాసాహెబ్‌కు ఘన నివాళులు

బాబాసాహెబ్‌కు ఘన నివాళులు

April 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలు ప్రతి ఒక్కరు అమలు చేయాలని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్‌ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని పూలతో అలంకరించారు. రెడ్డెప్ప విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర దళితసేవా సమితి అధ్యక్షుడు ఎం.శంకరప్ప ఆధ్వర్యంలో పట్టణంలో అంబేద్కర్‌ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అలాగే పోలీస్‌ స్టేషన్‌లో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. మండలంలోని సుగాలిమిట్టలో ఎస్టీ సంఘ నాయకులు ప్రభాకర్‌నాయక్‌, రాజునాయక్‌, శ్రీరాములు, శ్రీనివాసులునాయక్‌, వాసునాయక్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఎస్‌డిపిఐ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి అన్వర్‌బాషా ఆధ్వర్యంలో నివాళులర్పించారు. బిజెపి నాయకులు అయూబ్‌ఖాన్‌, కుమార్‌, నరసింహులు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మండలంలోని ఏతూరులో ఎంపిడివో అప్పాజి అంబేద్కర్‌కు నివాళులర్పించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి విశ్రాంత ఉద్యోగులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి రెడ్డెప్ప మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి అమర్‌రహే…అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నటరాజారెడ్డి, ఉపాధ్యాయులు బుడ్డన్న, సుబ్రమణ్యం, వెంకటేష్‌, శ్రీరాములురెడ్డి, మంజునాథ్‌, జివి.రమణ,కిషోర్‌కుమార్‌రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags: Grand Tributes to Babasaheb