April 14, 2026
Explore
సామాజిక సమరసత కోసం పోరాటం సాగించిన ధైర్యశాలి అంబేద్కర్ : APUS

సామాజిక సమరసత కోసం పోరాటం సాగించిన ధైర్యశాలి అంబేద్కర్ : APUS

April 14, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఆధ్వర్యంలో రాయచోటి మాసాపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా మంగళవారం నివాళులర్పించారు.అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నరసింహులు, జి. నాగేంద్రబాబు మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాలకు ఆదర్శప్రాయుడని, రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని కొనియాడారు. సామాజిక సమరసత కోసం జీవితాంతం పోరాడి హక్కులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags; Ambedkar: The Courageous Champion Who Fought for Social Harmony — APUS