అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శేషసాయి కళ్యాణ మండపంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష, డిఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tags: Bharat Ratna Dr. Babasaheb Ambedkar was a multifaceted genius – Collector