April 14, 2026
Explore
రూ.26.46 కోట్లతో జలధార – జలహారతి పనులు

రూ.26.46 కోట్లతో జలధార – జలహారతి పనులు

April 14, 2026 | Andhra Pradesh

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లాలో భూగర్భ జల మట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మొత్తం 274 నీటి సంఘాల ద్వారా 357 పనులు చేపట్టనున్నామన్నారు.మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జలధార – జల హారతి కార్యక్రమం కింద సాగు నీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం 3 మీటర్ల నుంచి 6 మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడిక తీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి & తాగునీటి సరఫరా, భూగర్భ జల మట్టం మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్ బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Jaladhara – Jalaharati Works at a Cost of Rs 26.46 Crores