April 14, 2026
Explore
అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, ఘన నివాళులు అర్పించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, ఘన నివాళులు అర్పించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

April 14, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, ఘన నివాళులు అర్పించిన … కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారన్నారు.

సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ప్రతి ఒక్కరూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలను పెంపొందించేందుకు కృషి చేయాలని కర్నూలు ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు సీఐలు మధుసుధన్ రావు, మన్సురుద్దీన్, నాగరాజారావు, మారుతి శంకర్ పాల్గొన్నారు.

Tags:SP Vikrant Patil garlanded the statue of Ambedkar and paid rich tributes.