పుంగనూరు ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త, విద్యావేత్త మరియు ఆర్థిక నిపుణుడు అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పుంగనూరు బిజెపి (BJP) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సి మోర్చా నాయకులు బి నరసింహులు,సీనియర్ నాయకులు నానా బాల కుమార్,మైనారిటీ నాయకులు అయూబ్ ఖాన్ పట్టణంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలని పిలుపునిచ్చారు.”అంబేద్కర్ అమర్ రహే” అంటూ చేసిన నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ, సమసమాజ స్థాపనకు కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
Tags:Dr. B.R. Ambedkar Birth Anniversary Celebrations Held with Great Grandeur