April 14, 2026
Explore
హరిప్రియ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం… బాధితుడు ప్రాణాలతో చెలగాటం

హరిప్రియ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం… బాధితుడు ప్రాణాలతో చెలగాటం

April 14, 2026 | Andhra Pradesh

న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు ఆర్ బి ఎస్ రాము కలెక్టర్, డి ఎం హెచ్ ఓ కు ఫిర్యాదు

  • కలెక్టర్ ఆదేశాల మేరకు హాస్పిటల్ యాజమాన్యంపై రెండు కమిటీలు వేయనున్నట్లు డి ఎం హెచ్ ఓ వెల్లడి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని హరిప్రియ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం… బాధితుడు ఆర్ బి ఎస్ రాము ప్రాణాలతో చెలగాడాటంతో పాటు అతనికి జరిగిన అన్యాయం పై సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో తిరుపతి జిల్లా కలెక్టర్, డి ఎం హెచ్ ఓ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే డి ఎం హెచ్ ఓ స్పందించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు హాస్పిటల్ పై రెండు కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం బాధితుడు ఆర్ బి ఎస్ రాము మాట్లాడుతూ తాను మంగళం డోర్ నెంబర్ 203, సెకండ్ ఫ్లోర్, వాసవి దీప్తి టవర్స్, మంగళం లో కాపురం ఉంటున్నామని అన్నారు.

కడుపు నొప్పి కారణంతో తిరుపతి ఎం ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని హరిప్రియ హాస్పిటల్లో ఏప్రిల్ 28 2025న చేరడం జరిగిందన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించి పిత్తాశయంలో రాయి ఉందని చెప్పి సర్జరీ చేసి జూన్ 18 2025 అన్న డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ చేసిన తిరిగి యధా ప్రకారం జ్వరం కడుపునొప్పి వాంతులు దురద రావడంతో తిరిగి హరిప్రియ హాస్పిటల్ ఎండి డాక్టర్ ఆదిత్యాను కలవడం జరిగిందన్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహించి పిత్తాశయం దగ్గర చీము ఉందని చెప్పారు. కానీ నిజానికి ఆపరేషన్ సమయంలో కామన్ డాక్ట్ కి గాయం కావడంతో టైప్ ఎ బైల్ లీక్ అయింది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ల బృందం మోసం చేయడంతో పాటు నా ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు.

తర్వాత కేస్ రిపోర్ట్ తీసుకొని జూలై 4 2025న మధు గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్కు వెళ్లడం జరిగిందని చెప్పారు. హాస్పిటల్లో అన్ని పరీక్షలు నిర్వహించి హరిప్రియ హాస్పిటల్ యాజమాన్యం వైద్యుల చేసిన నిర్వహణ గురించి వివరించి వెంటనే బాధితున్ని చెన్నై ఎం ఎం ఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ ఆస్పత్రిలో అన్ని పరీక్షలు నిర్వహించి సర్జికల్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని ఇ ఆర్ సి పి ద్వారా స్టంట్ వేశారు. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. హరిప్రియ హాస్పిటల్ యాజమాన్యం వైద్యుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 17 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతేకాకుండా నా ప్రాణానికి ప్రమాదం వచ్చి పడింది.

అంతేకాకుండా ఉద్యోగం కూడా పోయింది. కావున నా మీద దయ ఉంచి కలెక్టర్ గారు, డి ఎం హెచ్ ఓ వెంటనే స్పందించి హాస్పిటల్ యాజమాన్యం, నిర్లక్ష్యంపై తగు చర్యలు తీసుకొని నాకు జరిగిన ఆర్థిక నష్టంతో పాటు, నా ప్రాణాలతో చెలగాట మాడిన హరిప్రియ హాస్పిటల్ యాజమాన్యం వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుడు ఆర్ బి ఎస్ రాముతో పాటు బాధితుడు భార్య జయశ్రీ, అసోసియేషన్ ఫోర్ పీపుల్స్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ (ఏ పి హెచ్ ఆర్ సి) చైర్మన్ ఎన్ చంద్రకళ , మహిళా నాయకురాలు లక్ష్మీదేవి పాల్గొన్నారు.

Tags:Haripriya Hospital Doctors’ Negligence… Playing with the Patient’s Life