April 14, 2026
Explore
వైకాపా అరాచకాలను ఎండగట్టతాం: చమర్తి

వైకాపా అరాచకాలను ఎండగట్టతాం: చమర్తి

April 14, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

గత వైకాపా ప్రభుత్వ కాలంలో జరిగిన భూ అక్రమాలు, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు.

సోమవారం రాజంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో వైకాపా నాయకుల అక్రమాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని సూచించారు.

పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎలాంటి సమస్య వచ్చినా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Tags:We will expose YCP’s atrocities: Chamarti