April 14, 2026
Explore
రాష్ట్ర క్రీడా అకాడమీలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర క్రీడా అకాడమీలకు దరఖాస్తుల ఆహ్వానం

April 14, 2026 | Andhra Pradesh

– ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు

తిరుపతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాధికారి చంద్రశేఖర్ సోమవారం తెలిపారు.

వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో ఎంపికలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు (01-01-2008 నుంచి 01-01-2011 మధ్య జననం) కలిగిన వారు అర్హులని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం కేంద్రాల్లో వివిధ తేదీల్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఎంపికలకు హాజరయ్యేటప్పుడు అవసరమైన ధృవపత్రాలు తీసుకురావాలని సూచించారు. ఎంపికైన వారికి వసతి, భోజనం, కోచింగ్ వంటి సౌకర్యాలు కల్పించబడతాయని వెల్లడించారు.

Tags: Invitation of applications for state sports academies