అన్నమయ్య ముచ్చట్లు:
ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాధిక హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఐసిటిసి సిబ్బంది, కౌన్సిలర్లు, వైద్యులతో ఆమె మాట్లాడారు.
మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో లోపాలు ఉండకూడదన్నారు. గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. హెచ్ఐవి స్క్రీనింగ్, చికిత్సలో 95% లక్ష్యాలు, వైరల్ లోడ్ నియంత్రణలో 99% లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
Tags: Actions taken in case of neglect in AIDS control