మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో అప్పిలేట్ ట్రిబ్యునల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి తమను ఆహ్వానించాలని ట్రిబ్యునల్ అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు ముని గోపాలకృష్ణ జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు.
2023–2026 కాలానికి ట్రిబ్యునల్ సభ్యులుగా నియమితులైనప్పటికీ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు.
కనీసం మదనపల్లెలో అయినా సమావేశాలు నిర్వహించి సభ్యులను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాకు రైల్వే అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించాలని కోరారు.
Tags: Invite invitation to tribunal meetings: Gopal Krishna