చిత్తూరు ముచ్చట్లు:
బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో ఒక గ్రామాన్ని నిషేధిత జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సదుం మండలంలోని అమ్మగారిపల్లె, పుట్టావారిపల్లె, కంభంవారిపల్లెతో పాటు చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఆర్కేవీబీపేట ఇందిరా కాలనీలోని దేశీ పౌల్ట్రీ ఫారంను వ్యాధిగ్రస్త ప్రాంతాలుగా గుర్తించారు.
ఈ గ్రామాలకు ఒక కిలోమీటరు పరిధిని ఇన్‌ఫెక్టెడ్ జోన్‌గా, 1 నుంచి 10 కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాల నుంచి కోళ్ల రవాణాపై నిషేధం విధించారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: Annamayya district announces restricted zones in the wake of bird flu