April 14, 2026
Explore
జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లా లో పర్యటన

జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లా లో పర్యటన

April 14, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం ఈనెల 16న జిల్లాకు రానుంది. కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన ఈ బృందం 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించనుందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు అవుతున్న జలధార ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం “జలధార-జలహారతి” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోంది. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా అధ్యయనం చేపట్టేందుకు ఈ బృందం రానుంది.

Tags: Central team visits Annamayya district on Jaldhaar project