గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలంలోని నూలివీడు గ్రామంలో విషతుల్య మేత తిని 40 గొర్రెలు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓర్సు ఆదినారాయణ గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తుండగా, మేత కోసం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన వేరుశనగ గడ్డి తినడంతో ఈ ఘటన జరిగిందని బాధితుడు తెలిపాడు.
సమాచారం అందుకున్న పశువైద్య అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మాలకొండయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి ప్రాథమికంగా విషతుల్య మేత కారణంగానే మృతి జరిగిందని నిర్ధారించారు. వేరుశనగ పంటపై పురుగుమందు అవశేషాల వల్ల మేత విషపూరితమై ఉండొచ్చని తెలిపారు. బతికున్న గొర్రెలకు వైద్య పరీక్షలు కొనసాగించారు.
Tags: 40 gorillas died due to poisonous gas in Halyweed