April 13, 2026
Explore
డీసీసీబీ చైర్మన్ శివ్వాలను కలిసిన లోతుగడ్డ

డీసీసీబీ చైర్మన్ శివ్వాలను కలిసిన లోతుగడ్డ

April 13, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం డీసీసీబీ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణని మర్యాద పూర్వకంగా లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావు కలిసారు. ఈ సందర్బంగా వైస్ ఎంపీపీ లోతుగడ్డ జిల్లాలోనే కొత్తూరు మండలం పెద్ద మండలం అని, మెట్టూరు పాపులేషన్ఎక్కువగా ఉందని ఇక్కడ వంశధార నిర్వాసితులు ఎక్కువుగా ఉన్నారని, గిరిజనులు కూడా ఉన్నారని, రైతులు ఎక్కువుగా ఉండే ప్రాంతమని కావున ఇటువంటి ప్రాంతంలో డీసీసీబీ బ్యాంకు ఎంతో అవసరముందని, ఇక్కడ బ్యాంకు కేటాయించాలని డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్ శివ్వాల సూర్యనారాయణని కోరారు. దానికి డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ సానుకూలంగా స్పందించి తనవంతు సహకారాన్ని అందస్తానని తెలిపారు.

Tags: Lothugadda Meets DCCB Chairman Shivvala