తిరుమల ముచ్చట్లు:
లగేజీ కౌంటర్ లో భక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి విధుల నుండి తొలగింపు
తిరుమలలోని లగేజీ సెంటర్ లో నరసింహారెడ్డి అనే వ్యక్తి భక్తుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది.
సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుండి తొలగించడం జరిగింది.
టీటీడీ లగేజీ డిపాజిట్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. భక్తులెవ్వరూ తమ లగేజీ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని టీటీడీ తెలియజేస్తోంది.
నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ : 9866898630 కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
Tags: Individual who collected money dismissed from duties.