April 13, 2026
Explore
క్షత్రియ సంఘ ప్రతినిధిగా రాధాకృష్ణ వర్మ

క్షత్రియ సంఘ ప్రతినిధిగా రాధాకృష్ణ వర్మ

April 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

రాయలసీమ జిల్లాల క్షత్రియ సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్గా రాధాకృష్ణ వర్మ(నాని) ఎంపికైయ్యారు. క్షత్రియ సంఘ సమావేశం తిరుపతిలో నిర్వహించారు. క్షత్రియ సంఘం సమావేశాన్ని టీటీడీ మాజీ జెఈవో శ్రీనివాసరాజు, ప్రముఖ విద్యావేత్త , కళాశాలల చైర్మన్‌ అశోక్‌రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ , నారాయణబాబు, శివరాజు, బాలరామరాజు, బీరేంద్రవర్మ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కెఎల్‌.వర్మ కుమారుడు , పారిశ్రామికవేత్త రాధాకృష్ణవర్మ (నాని) ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ క్షత్రియ సంఘ సభ్యుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు. క్షత్రియ సంఘ సభ్యులను ఏకతాటిపై తీసుకొచ్చి , క్షత్రియ సంఘం తిరుగులేని శక్తిగా ఏర్పాటైయ్యేందుకు పెద్దలందరి సహాయ సహకారాలు తీసుకుని పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా క్షత్రియ సంఘ సభ్యులు నాని ని సన్మానించి, అభినందించారు.

Tags:Radhakrishna Varma as Representative of the Kshatriya Association