పుంగనూరు ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలను విద్యార్థులతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని కొనియడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అనిల్‌కుమార్, డాక్టర్ సోమరాజు, షాహీదాభాను, విజయశ్రీ, శ్రవంతి, నిర్మల, శ్రావణి, శ్రీనివాసులు , రామ్‌కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: We should take Dr. Babasaheb Ambedkar as a role model.