April 13, 2026
Explore
కోరిక తీర్చిస్తానంటూ వల వేసిన హిజ్రా

కోరిక తీర్చిస్తానంటూ వల వేసిన హిజ్రా

April 13, 2026 | Andhra Pradesh

బ్లాక్‌మెయిల్ చేసి రూ.1.40 లక్షలు దోచుకున్న ఘటన

హైదరాబాద్ ముచ్చట్లు:


కోరిక తీర్చిస్తానంటూ ప్రైవేట్ ఉద్యోగిని వలలో వేసి, అనంతరం బెదిరింపులకు గురి చేసి రూ.1 లక్ష 40 వేల రూపాయలు వసూలు చేసిన హిజ్రా వ్యవహారం హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత నెల 28న టాస్ పబ్ సమీపంలో ఒక ప్రైవేట్ ఉద్యోగిని హిజ్రా పరిచయం చేసుకుంది. లైంగిక కోరిక తీర్చిస్తానంటూ అతడిని ఆకర్షించి, మాయ మాటలు చెప్పి ఒక గదికి తీసుకెళ్లింది. ముందుగా రూ.3,500కి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

అయితే గదికి వెళ్లిన తర్వాత హిజ్రా తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టి, ఉద్యోగిని బెదిరింపులకు గురి చేసింది. అతడి వద్ద ఉన్న వ్యక్తిగత వివరాలు, ఫోటోలు బయటపెడతానంటూ రూ.2 లక్షలు డిమాండ్ చేసింది. అంత డబ్బు వెంటనే లేకపోవడంతో బాధితుడు ఇంటికి వెళ్లి బంగారు గాజులు, ఇతర ఆభరణాలు మరియు నగదు కలిపి మొత్తం రూ.1 లక్ష 40 వేల విలువ చేసే సొమ్మును తీసుకువచ్చి ఆమెకు ఇచ్చాడు.

ఇదిలా ఉండగా, శనివారం మళ్లీ బాధితుడి ఇంటి వద్దకు వెళ్లిన హిజ్రా తన దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని చెప్పి మరలా బ్లాక్‌మెయిల్ చేయడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags: Wanting to fulfill his wish, he went for Hijra…