April 13, 2026
Explore
మదనపల్లి దౌర్జన్య ఘటనపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

మదనపల్లి దౌర్జన్య ఘటనపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

April 13, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు ఇంటిలోకి ఆదివారం దౌర్జన్యంగా ప్రవేశించి శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష డిమాండ్ చేశారు. బాధితుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయన తాలూకా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Tags: Action should be taken against Madanpalli riot incident: MLA