April 13, 2026
Explore
చట్టపరిధిలోనే బాధితులకు న్యాయం: జిల్లా ఎస్పీ

చట్టపరిధిలోనే బాధితులకు న్యాయం: జిల్లా ఎస్పీ

April 13, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని పరిశీలించారు.

కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసాలు తదితర అంశాలపై ఎస్పీ విచారణ చేపట్టారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయాలని ఆదేశించారు. చర్యలు తీసుకున్న అనంతరం పూర్తి నివేదికలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు.

Tags: Justice for victims within the limits of law: District SP