April 13, 2026
Explore
సర్వేయర్ మోసంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

సర్వేయర్ మోసంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

April 13, 2026 | Andhra Pradesh

కలకడ ముచ్చట్లు:

కలకడ మండలంలో భూవివాదం మరోసారి వెలుగుచూసింది. కలకడ సర్వేయర్ అనీల్ మోసం కారణంగా తన పేరుతో అన్ని రికార్డులు ఉన్నప్పటికీ విలువైన భూమిని కోల్పోయానని బాధితుడు మునిరత్నం ఆరోపించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

దేవలంపల్లి హరిజనవాడకు చెందిన మునిరత్నానికి 2 ఎకరాల పట్టా భూమి ఉన్నప్పటికీ, ఆ భూమిపై సర్వేయర్ అనీల్ కన్నేసి గ్రామానికి చెందిన వెంకటరమణ, నాగిరెడ్డి, రవితో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు అధికారులను కోరారు.

Tags: Complaint to collector on surveyor fraud