April 13, 2026
Explore
ఆర్పీలకు రూ.24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన

ఆర్పీలకు రూ.24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన

April 13, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆర్పీలు నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్ మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సుమారు 70 మంది రిసోర్స్ పర్సన్స్‌కు నెలకు రూ.24,000 జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ 2007 నుంచి సేవలు అందిస్తున్నప్పటికీ ప్రస్తుతం కేవలం రూ.8,000 మాత్రమే జీతంగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పని భారం దృష్ట్యా తమకు తగిన వేతనం ఇవ్వాలని, కనీసం జీవనోపాధికి సరిపడే విధంగా జీతం పెంచాలని కోరారు.

Tags: Protest against giving Rs. 24 thousand winnings to RPs