April 13, 2026
Explore
ప్రేమ వివాహం.. జంటకు భద్రత కోరుతూ విజ్ఞప్తి

ప్రేమ వివాహం.. జంటకు భద్రత కోరుతూ విజ్ఞప్తి

April 13, 2026 | Andhra Pradesh

చాపాడు ముచ్చట్లు:

చాపాడు మండలం కు చెందిన సుమంత్, స్రవంతి ఇద్దరూ మేజర్లు కావడంతో స్వచ్ఛందంగా వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రాయచోటి బైపాస్ రామాలయంలో సాదాసీదాగా పెళ్లి జరిగినట్లు వెల్లడించారు.

కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన జంట, తమకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రేమ వివాహంపై కుటుంబాల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని పోలీసులను కోరారు.

Tags: love marriage..appeal seeking safety for the couple