April 13, 2026
Explore
అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు

అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు

April 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈ నెల 6న శాంతిపై కేసు నమోదు చేశారు. 7న ఆమెకు సంబంధించిన మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.1.37 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అదే రోజు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

ఏపీ సివిల్‌ సర్వీస్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కె. శాంతిని సస్పెండ్ చేశారు. ఆమె అరెస్టయిన ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుంద‌ని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Tags; Corruption allegations..Devadavaya department AC Shanti suspended