April 13, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

April 13, 2026 | Andhra Pradesh

సంబెపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం నారాయణరెడ్డి పల్లె సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో గరుగుపల్లెకు చెందిన ఓర్సు వాసుదేవ గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం, వాసుదేవ ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం నారాయణరెడ్డి పల్లెకు వచ్చి తిరిగి వెళ్తుండగా పీలేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తలకు, కుడిచేయి, ఎడమ కాలుకు గాయాలయ్యాయి.

గాయపడిన వాసుదేవను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: road accident person injured