April 12, 2026
Explore
అమెరికా ఇరాన్‌ మధ్య చర్చలు విఫలం..

అమెరికా ఇరాన్‌ మధ్య చర్చలు విఫలం..

April 12, 2026 | Andhra Pradesh

అర్ధాంతరంగా చర్చలు ముగించి వెళ్లిపోయిన జేడీ వాన్స్‌ బృందం

అమెరికా ముచ్చట్లు:

❇️పశ్చిమాసియా యుద్ధాన్ని(US-Iran war) ముగించేందుకు చేపట్టిన చర్యలు విఫలమైనట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపచేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన ప్రతిష్టంభన తొలగించి శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌(JD Vance) నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్‌లో ఇరాన్‌ ప్రతినిధులతో చారిత్రాత్మక ముఖాముఖీ చర్చలు జరిపింది.

❇️ అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని జేడీ వాన్స్‌ తెలుపడంతో ఆందోళన కలిగిస్తున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిబంధనలు అంగీకరించేందకు ఇరాన్‌ ఏమాత్రం సిద్ధంగా లేదని జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

Tags; Talks between the US and Iran fail.