పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ సత్రంలో అయ్యప్పస్వాములకు 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ హరిహరసుతన్ అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు పూలకృష్ణాస్వామి, కాటిపేరి చింతావెంకట్రమణారెడ్డిలు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ప్రతిరోజు 1గంట, 3 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో భోజనంతో పాటుగా అరటిపండు, స్పీట్, అప్పడం అయ్యప్ప భక్తులకు బిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప మాల ధరణలో ఉన్న భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ట్రస్ట్ నిర్వాహకులు కోరారు.
Tags: Annadanam (offering of free food) for Ayyappa devotees for 41 days.