పుంగనూరు ముచ్చట్లు:
కార్పెంటర్లు నైపుణ్య అభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కార్మికశాఖ , నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ట్రైనర్ మునెప్ప సూచించారు. ఆదివారం ఆయన కార్మికులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం అందించే గుర్తింపు సర్టిఫికెట్ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్మికులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Tags: Free training for carpenters