March 11, 2026
Explore
స్మశానవాటికకు క్రిమెటోరియం ఏర్పాటు చేస్తాం

స్మశానవాటికకు క్రిమెటోరియం ఏర్పాటు చేస్తాం

March 11, 2026 | Andhra Pradesh

  • పూర్వపు విద్యార్థులు వెల్లడి

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1982-84సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ చదువుకున్న విద్యార్థులు బుధవారం కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం స్మశాన వాటికకు స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో భౌతికకాయాలను ఖననం చేసేందుకు క్రిమెటోరియం నిర్మించి, హిందూవులు కర్మకాండలు చేసుకునేందుకు వీలుగా వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు విజయభాస్కర్‌రాజు, రమేష్‌, హరినాథరెడ్డి, ఉదయ్‌కుమార్‌, నాగరాజ, డికె.నాగరాజ, హరిప్రసాద్‌, సునీల్‌కుమార్‌, దేవరాజు, శివశంకర్‌, రవిచంద్రన్‌, బాలాజి, హరిప్రసాద్‌, చక్రపాణి, కె.నాగరాజ, తులసిరాం తదితరులు పాల్గొన్నారు.

Tags: We will set up a crematorium for the cemetery.