April 12, 2026
Explore
13 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

13 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

April 12, 2026 | Andhra Pradesh

అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చు…..

అర్జీలపై సమాచారం కొరకు మీకోసం కాల్ సెంటర్ నెంబర్ 1100 ను సంప్రదించగలరు….

….జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి ముచ్చట్లు:

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 13 న సోమవారం ఉదయం 10.00గం.ల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అర్జీదారులు వారి యొక్క అర్జీలను జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించగలరని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.

Tags: Public Grievance Redressal Forum at the Collectorate on Monday, the 13th.