April 12, 2026
Explore
గుడిసివారిపల్లెలో ఇరు వర్గాల పరస్పర దాడులు: అన్నా చెల్లెళ్లకు కత్తిపోట్లు

గుడిసివారిపల్లెలో ఇరు వర్గాల పరస్పర దాడులు: అన్నా చెల్లెళ్లకు కత్తిపోట్లు

April 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలంలో ఇరు వర్గాలు ఆదివారం సాయంత్రం బికారంగా కొట్టుకున్నారు. కర్రలు, కత్తులతో ఒకరిపై మరొకరు విచక్షణ రహితంగా దాడులు చేసుకోవడంతో అన్నా చెల్లెళ్లు కత్తిపోట్లకు గురయ్యారు. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొత్త వారి పల్లె పంచాయతీ, గుడిసివారి పల్లెలో కాపురం ఉంటున్న అన్నా చెల్లెల్లు పవన్ కుమార్, భవాని లతో అదే ఊరికి చెందిన నవీన్, అనూప్ లు పాత కక్షల కారణంగా కత్తులు రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ప్రతిదాడిలో ప్రత్యర్థులు సైతం స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. దాడిని అడ్డుకోబోయిన పవన్ కుమార్ తల్లి అంజమ్మ, బాబా రెడ్డప్ప సైతం తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ఇస్తానికి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags: Mutual Attacks Between Two Factions in Gudisivaripalle: Brother and Sister Stabbed