April 12, 2026
Explore
అంబేద్కర్‌ ఆశయాలను కాపాడుతాం

అంబేద్కర్‌ ఆశయాలను కాపాడుతాం

April 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలను కాపాడుతామని రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. ఆదివారం అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ముందుగా నల్లూరుపల్లె గ్రామంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ స్థలంలో జెండాను ఎగురవేసి , బోర్డును ఏర్పాటు చేశారు. ఆస్థలంలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్‌ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శివరామిరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, చిన్నరెడ్డెప్పరెడ్డి, రాఘవరాయల్‌, బాబురెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్‌, మునిరత్నంతో పాటు దళిత నాయకులు పెంచుపల్లి కృష్ణ, నరసింహులు, బ్యాంక్‌ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags; We will uphold Ambedkar’s ideals.