తిరుపతి ముచ్చట్లు:
- తిరుపతి జిల్లాలో గతంలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాల కొరకు జరిగిన వరుస హత్య కేసుల (Murder for gain) మిస్టరీ ని చేధించిన జిల్లా పోలీసులు.
- జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో2024 వ సం. నుండి ఇప్పటి వరకు నమోదు కాబడిన Murder for gain కేసుల చేధింపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, . అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యములో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు.
- రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 11-01-2026 వ తేదీన జరిగిన మహిళ హత్య మరియు బంగారు ఆభరణాల చోరీ (Murder for gain) కేసులో అరెస్టు కాబడిన ముద్దాయి పి. విశ్వనాథ్ @ ప్రశాంత్ గౌరవ కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం తిరుపతి CCS, పరిధిలో జరిగిన రాబరీ కేసులో తదుపరి దర్యాప్తు నిమిత్తము పోలీస్ కస్టడీ కి తీసుకుని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.
- పోలీసుల కస్టడీ విచారణలో ఆశ్చర్యకరమైన మరియు సంచలనాత్మకమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన దర్యాప్తు బృందం.
- తిరుపతి జిల్లా పరిధిలో జరిగిన సంచలనాత్మకమైన తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన రెండు murder for gain కేసులు, తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధి లో రిపోర్ట్ కాబడిన ఒక రాబరీ కేసు తో పాటు పిచ్చాటూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన ఒక murder for gain (మొత్తం నాలుగు కేసుల మిస్టరీ ని ఛేదించి, సదరు ముద్దాయి ని అంతర రాష్ట్ర Most wanted criminal అయిన ఎ.ఎం. అజీజ్ @ అబ్దుల్ అజీజ్ @ కర్ణాటక అజీజ్ గా గుర్తింపు.
- 2018 వ సంవత్సరంలో కేరళ పోలీసుల కస్టడీ నుండి తప్పించుకుని తిరుగుతున్న ఎ.ఎం. అజీజ్ @ అబ్దుల్ అజీజ్ @ కర్ణాటక అజీజ్@ ప్రశాంత్ @ విశ్వనాథ్, అప్పట్లో అతని ఆచూకీ తెలిపిన వారికి రెండు లక్షల రివార్డు ప్రకటించిన కేరళ పోలీస్ శాఖ.
- కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం సుమారు 21 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ.
- కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా కి చెందిన విశ్వనాథ్ యొక్క ఆధార్ కార్డు ని తన గుర్తింపు నిమిత్తం ఉపయోగించినట్లు నిర్ధారణ.
- పోలీస్ కస్టడీ లో ముద్దాయి ద్వారా రాబడిన సమాచారము మేరకు నేరాలలో అతనికి సహకరించిన వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళ అరెస్ట్.
- సుమారు రూ.20.5 లక్షల విలువ కలిగిన 127.5 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 48 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు, నేరాలకు ఉపయోగించిన ఆటో స్వాధీనం.
- తిరుపతి జిల్లా పరిధిలో వివిధ పోలిస్ స్టేషన్ ల పరిధిలో నమోదు కాబడిన Murder for gain కేసులతో పాటు వివిధ దొంగతనాల కేసులను జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా అడిషనల్ యస్. పి. (క్రైమ్స్) ఏ. శ్రీనివాసులు నేతృత్వం లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.
- ఈ కేసు వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన) శ్రీనివాసులు గారు (క్రైమ్) డిఎస్పి లు గీత (ఎస్బి ఇంచార్జ్) శ్యాంసుందర్ సిసిఎస్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ వారు పాల్గొన్నారు.
- దర్యాప్తు లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల కోసం ఒక మహిళను హత్య చేసిన కేసులో 23.01.2026వ తేదీన అరెస్టు కాబడిన ముద్దాయి పి. విశ్వనాథ్ @ ప్రశాంత్ ను తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన రాబరీ కేసు లో గౌరవ కోర్టు ఉత్తర్వు ద్వారా పోలీస్ కస్టడీ కి తీసుకొని విచారించడం జరిగింది.
- విచారణ లో భాగంగా ముద్దాయి పి. విశ్వనాథ్ @ ప్రశాంత్ యొక్క అసలు పేరు ఎ.ఎం. అజీజ్ @ అబ్దుల్ అజీజ్ @ కర్ణాటక అజీజ్ (వయస్సు 39 సంవత్సరాలు), తండ్రి మహమ్మద్, స్వస్థలం అజ్హవర గ్రామం, సులియా తాలూకా, దక్షిణ కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రము గా గుర్తించడం జరగింది.
- ఇతని పై కర్ణాటక రాష్ట్రం లో ని వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధి లో 4 కేసులు మరియు కేరళ రాష్ట్రము నందు కూడా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 కేసులు మరియు తిరుపతి జిల్లా పరిధిలో 11 కేసులు కలిపి మొత్తం 21 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ.
- 2018లో కేరళ రాష్ట్రంలో Robbery మరియు హత్య కేసులో పోలీస్ కస్టడీలో తీసుకువెళ్తున్న సమయంలో బేకల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సులియా బస్ స్టాండ్లో పోలీసుల ఎస్కార్ట్ నుండి తప్పించుకుని పారిపోయి తిరుపతికి చేరుకున్నట్లు, అతని ఆచూకీ తెలిపిన వారికి అప్పట్లో కేరళ పోలీసులు 2 లక్షల రూపాయల బహుమతిని కూడా ప్రకటించినట్లు తెలిసినది.
- తిరుపతికి చేరుకున్న అనంతరం తన అసలు గుర్తింపును పూర్తిగా దాచిపెట్టి “పి. విశ్వనాథ్ @ ప్రశాంత్” అనే పేరుతో ఉన్న ఆధార్ కార్డును తన గుర్తింపు కార్డు గా ఉపయోగించుకొని, హోటళ్లలో పని చేస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకుని, ఈ క్రమంలో వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పరచుకుని, ఆమె సహకారంతో AP-39-US-9445 నంబరు గల ఆటో రిక్షాను కొనుగోలు చేసి, సదరు ఆటో రిక్షాను ఉపయోగించి పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
- నిందితుని వాంగ్మూలం మేరకు, అతని వద్ద 51.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని, అతనికి నేరాలలో సహకరించిన వెదురుకుప్పం మండలానికి చెందిన యల్.రాజమ్మను 12.04.2026 అరెస్టు చేసి, ఆమె వద్ద నుండి 76 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 48 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. (రూ. 21.5 లక్షల రూపాయల విలువ గల 127.5 గ్రాముల బంగారు మరియు 48 గ్రాముల వెండి ఆభరణాలు తో పాటు ఒక ఆటోను స్వాధీనం).
- దర్యాప్తులో కీలక సమాచారము సేకరించడములోనూ, వివిధ కీలకమైన కేసులను ఛేదించి చోరీ సొత్తు ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందం లోని తిరుపతి జిల్లా అడిషనల్ యస్. పి. (క్రైమ్స్) ఏ. శ్రీనివాసులు, క్రైమ్స్ డి.యస్.పి. వై.శ్యామ్ సుందర్, పు.త్తూరు డి.యస్.పి. జి.రవికుమార్ మరియు క్రైమ్స్ ఇన్స్పెక్టర్లు ఎన్. శివకుమార్ రెడ్డి, ఎం. దివాకర్ రెడ్డి, తిరుచానూరు ఇన్స్పెక్టర్ బి. సునీల్ కుమార్, పుత్తూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి. రవీంద్ర, యస్.ఐ లు యం.నాగార్జున రెడ్డి, చిరంజీవి, సుభాన్ నాయక్, మల్లయ్య మరియు సిబ్బంది మురళి, వెంకటేశ్వర్లు, సుబ్రమణ్యం రాజు, రాజశేఖర్, మోహన్, రమేశ్, ప్రభాకర్, దామోదరం, శ్రీనివాసులు, రామకృష్ణ, మునిరత్నం, గోపి కృష్ణ, నాగరాజు శెట్టి, హరి ప్రసాద్ లను జిల్లా యస్.పి. ప్రత్యేకంగా అభినందించి వారందరికీ నగదు రివార్డులతి పాటు ప్రశంసాపత్రాలు ఇవ్వడం జరిగింది.
Tags: District Police Solve Mystery of Series of Murders.