April 12, 2026
Explore
అర్ధరాత్రి ఇంట్లో RMP డాక్టర్ దారుణ హత్య

అర్ధరాత్రి ఇంట్లో RMP డాక్టర్ దారుణ హత్య

April 12, 2026 | Andhra Pradesh

బాపట్ల ముచ్చట్లు:

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం అర్ధరాత్రి ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మేడగం కోటిరెడ్డి అనే RMP డాక్టరును గుర్తుతెలియని దుండగులు తన నివాసంలోనే అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ సంఘటన రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో జరిగినట్లు స్థానికులు గుర్తించారు.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. CI సుబ్బరాజు తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు మరియు నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags: RMP Doctor Brutally Murdered at Home at Midnight