March 11, 2026
Explore
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు

March 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ తీసుకెళ్తున్న ద్విచక్రవాహన దారులను కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం జరిగింది. రామసముద్రం మండలం అజ్జంరెడ్డిపల్లెకి చెందిన గంగరాజు(30), శ్రీనివాసులురెడ్డి(31) యువకులు ద్విచక్రవాహనంలో ఇంటికి సిలిండర్‌ తీసుకుని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు గమనించి గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని తిరుపతికి తరలించారు. ఈ మేరకు పొలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Car hits a two-wheeler