ఒంగోలు ముచ్చట్లు:
తల్లి తండ్రులకి ఒక్కటే మనవి….కాలేజి,స్కూల్స్ సెలవులు వచ్చాయి.. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు?అనేది ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోండి…మరియు బైక్స్ ఇవ్వమాకండి….చేసే చిన్న పొరపాటు …కడుపుకోతదయచేసి
ఈత సరదా యువకుని ప్రాణం తీసింది.
శనివారం ముగ్గురు యువకులు సరదగా రామతీర్థం ఆలయం సమీపం నుంచి వెళ్తున్న ఒంగోలు బ్రాంచ్ కాలువలో ఈత కొడదామని దిగారు.
వారిలో సయ్యద్ అబ్దుల్ రెహమాన్(22) అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకొని వెళ్లి డ్రాపులో చిక్కుకుపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
విషయం తెలుసుకున్న చీమకుర్తి సీఐ దాసరి ప్రసాదు, ఎస్‌ఐ కృష్ణయ్యలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
డ్రాపులో ఇరుక్కుపోయిన రెహమాన్‌ని బయటకు తీసుకువచ్చి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా మృతుడు పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. బోర్‌వెల్ బండితో బోర్లు వేసే నిమిత్తం ఇక్కడకు రావటం జరిగింది.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు
Tags: The fun of swimming claimed a life!