April 12, 2026
Explore
మత్తులో ముంచి..

మత్తులో ముంచి..

April 12, 2026 | Andhra Pradesh

అంతమొందించి..

పల్నాడు లాయర్ హత్య కేసులో నిందితుడిని పట్టించిన ‘ఫోన్ పే’!

పల్నాడు ముచ్చట్లు:

ఈ ఘటన పోలీసుల లోతైన విచారణలో పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా తేలింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న వ్యక్తిని, రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే తన స్నేహితుడితో కలిసి అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో గల యడవల్లి వద్ద గత శుక్రవారం ఏప్రిల్ 10, 2026 న జరిగిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా తేలింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న వ్యక్తిని, రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే తన స్నేహితుడితో కలిసి అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Tags: Plunged into Intoxication…