పల్నాడు ముచ్చట్లు:
ఒక్కసారి ఆలోచన చేయండి…ప్రజలలో విలువ గల స్థానంలో ఉండి ప్రజలచేత విలువ పోగొట్టుకోవడం అవసరమా….మీ వలన నిజాయితీ గల పోలీసు వారికి, వ్యవస్థ కి ఎంత మచ్చ
పల్నాడు జిల్లా పోలీసు శాఖ లో ఏమి జరుగుతోంది?…ప్రజా సమస్యలను తీర్చాల్సిన పోలీసులు ఉన్నతమైన స్థానంలో ఉండి… ఇలా చేయడం ఎంత వరకు కరెక్టు?
పల్నాడు:- జిల్లా లో పలువురు పోలిస్ అధికారులు, సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి…
జిల్లా లో పదిహేను రోజుల్లో కొందరి సిబ్బంది వల్ల శాఖా పరువు పోతుందని పలువురు పోలిస్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టేషన్ కు వచ్చిన మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఒక సిఐ పై బదిలీ వేటు పడగా, పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సిఐ సస్పెండ్ అయ్యాడు… బాద్యులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు… ఇవి ముగిసే లోపే ఎ ఎస్ ఐ రాసలీలల వీడియో హాల్ చల్ తో 15 రోజుల్లో పలువురు వల్ల పరువు పోతుందని పలువురు అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Amorous Liaisons… Extortion and Bribery…!!!